దేవాలయాల పరిరక్షణ కోసం శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ని కలిసిన అమ్మ కొండవీటి జ్యోతిర్మయి:
ఈ నాడు దేవాలయాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ముఖ్యంగా తిరుమల లాంటి దేవాలయాలు రాజకీయ మయంగా మారటాన్ని వంటి అనేక విషయాలను అమ్మ కొండవీటి జ్యోతిర్మయి శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ దృష్టికి తీసుకు వచ్చారు. బెంగుళూరు లోని ఆర్ట్ అఫ్ లివింగ్ ఆశ్రమంలో బుధవారం అమ్మ జ్యోతిర్మయి కలిసారు. నాటి నుండి నేటివరకు దేవాలయాలను భక్తుల నుండి దూరం చేసారని దాని ఫలితంగా నేడు భక్తుడు భగవంతుడికి దూరం అవుతున్నారని దానికి నేటి రాజకీయ వ్యవస్థ ముఖ్య కారణమన్నారు. రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ దేవాలయాల్లో సంపూర్ణ మార్పు రావాలని,దానికి ఆర్ట్ అఫ్ లివింగ్ నుండి సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పారు.చివరిగా అయోధ్య రామమందిరం కోసం వారు చేస్తున్న కృషిని అమ్మ అభినందించారు.